BDK: ఇందిర గాంధీ మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఆదివారం కరకగూడెం మండలంలో డ్వాక్రా మహిళలకు ఇందిరమ్మ చీరలను ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పంపిణీ చేశారు. అన్ని రంగాల్లో మహిళలను ప్రోత్సహించడం కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారని ఎమ్మెల్యే సూచించారు. ఆర్థికంగా తోడ్పడేందుకు పథకాలు ప్రవేశపెట్టామన్నారు.