SRD: నిజాంపేట మండలం సైన్స్ ల్యాబ్ నూతన భవనం నిర్మాణానికి ఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి భూమి పూజ చేశారు. పీఎం శ్రీ పథకం కింద రూ. 21 నిధులు మంజూరు కాగా పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. విద్యార్థులకు సైన్స్ ల్యాబ్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శంకర్ గౌడ్, నాయకులు ఉన్నారు.