NLG: చిట్యాల మండలంలోని తాళ్లవెల్లంల గ్రామంలో ఆదివారం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరా మహిళా శక్తి చీరలను నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఇందిరమ్మ రాజ్యంలో మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇచ్చామని, ప్రతీ పేద మహిళకు ఇందిరమ్మ కానుక కింద చీరల పంపిణి ప్రారంభం అయిందని తెలిపారు.