ప్రకాశం: చంద్రశేఖరపురం మండలంలోని రేగుల చెలకలో వింత ఘటన జరిగింది. గ్రామంలోని ఓ రైతుకు చెందిన గేదె ఆదివారం రెండు తలల దూడ జన్మించింది. అయితే, కొద్దిసేపటికి ఆ దూడ మృతి చెందింది. ఈ వింత దూడను చూసేందుకు గ్రామస్తులు ఆసక్తిని కనబరిచారు. జన్యుపరమైన లోపాల వల్ల ఇటువంటి దూడలు పుట్టే అవకాశం ఉందని పశు వైద్య నిపుణులు చెబుతున్నారు.