KMM: సామినేని రామారావు హత్యకు నిరసనగా, హంతకులను వెంటనే అరెస్ట్ చేసి శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 25వ తేదీన ఖమ్మం కలెక్టరేట్ వద్ద భారీ నిరసన ధర్నా నిర్వహించనున్నట్లు సీపీఎం వైరా డివిజన్ కమిటీ కార్యదర్శి భూక్యా వీరభద్రం ఆదివారం తెలిపారు. ఉదయం 10 గంటలకు జరిగే ఈ ధర్నాలో గ్రామ శాఖల నుంచి పార్టీ శ్రేణులందరూ భారీగా పాల్గొనాలని వారు కోరారు.