KMM: నూతన ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులుగా నూతి సత్యనారయణ నియమితులయ్యారు. కాగా వారిని ఆదివారం కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు కోసూరి శ్రీనివాసరావు, ఆదినారాయణ, లక్ష్మయ్య, రవి, వైరా పట్టణంలోని సత్యనారాయణ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. వారిని శాలువాతో సత్కరించారు. భవిష్యత్తులో మరిన్ని పదవులు చేపట్టాలని కోరుకున్నారు.