SKLM: జలుమూరు మండలం చల్లవానిపేట జగనన్న కాలనీలో గత మూడు రోజులుగా త్రాగునీరు లేక అనేక ఇబ్బందులు పడుతున్నామని కాలనీవాసులు తెలిపారు. పది రోజుల నుంచి ఇదే సమస్యతో సతమతమవుతున్నామని స్థానిక సర్పంచ్ పంచ రెడ్డి రామచందర్రావు మూడు రోజులు వాటర్ ట్యాంకీతో నీటి సరఫరా చేశారని తెలిపారు. శాశ్వత పరిష్కారం చేయాలని అధికారులను ప్రజలు కోరుతున్నారు.