GNTR: ఈనెల 28న రాజధాని అమరావతిలో పలు బ్యాంక్ భవనాలకు శంకుస్థాపన జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ హాజరుకానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వివిధ బ్యాంకులకు CRDA భూకేటాయింపులు చేసింది. శంకుస్థాపన అనంతరం CRDA ప్రధాన కార్యాలయం దగ్గర సభకు నిర్మలా సీతారామన్, పెమ్మసాని, చంద్రబాబు, పవన్ హాజరు కానున్నారు.