W.G: మొగల్తూరు మండలం కేపీపాలెం జడ్పీ ఉన్నత పాఠశాల అభివృద్ధికి ఓ పూర్వవిద్యార్థి అండగా నిలిచారు. ల్యాబ్ ఏర్పాటు నిమిత్తం పేరుపాలెం సౌత్‌కు చెందిన మేళం పాండురంగారావు, యతిరాజా తాయారు దంపతులు రూ. 5,00,000 భారీ విరాళాన్ని ప్రకటించారు. శనివారం ఈ మొత్తానికి సంబంధించిన చెక్కును హెచ్ఎం పితాని ఇందిరకు అందజేశారు.