PPM: పార్వతిపురం పట్టణంలోని సన్యాసిరాజు పార్క్ ప్రక్కగల సీతారామ కాలనీలో నెల్లిచెరువు కబ్జా వలన డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ.. అధికారులకు ఎన్నిసార్లు గ్రీవెన్స్‌లో విన్నవించిన ఫలితం లేదు అన్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి తగు చర్యలు తీసుకొని డ్రైనేజీ వ్యవస్థని బాగు చేయాలని కోరారు.