HYD: మొయినాబాద్లో రహస్యంగా జరుగుతున్న కోడిపందేలు నిర్వహిస్తుండగా పోలీసులు దాడి చేశారు. రాజమండ్రికి చెందిన నిర్వాహకుడు దాట్ల కృష్ణంరాజుతో సహా మొత్తం 14 మందిని అదుపులోకి తీసుకున్నారు. రూ. 60,950 నగదు, 4 కార్లు, 13 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అలాగే 18 కోడికత్తులు, 15 ప్రాణం ఉన్న కోళ్లు, 7 చనిపోయిన కోళ్లు దొరికాయి.