ప్రకాశం: పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్ సంచులను నిషేధించాలని జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో పామూరులో ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జెవివి నాయకులు గుడ్డ సంచులను స్థానికులకు పంపిణీ చేశారు. ప్లాస్టిక్ సంచులను నిషేధించి, జనపనారతో లేదా గుడ్డతో చేసిన సంచులను ప్రతి ఒక్కరు వినియోగించి పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని సూచించారు.