ADB: ఉట్నూర్ మండల కేంద్రంలోని స్థానిక MPDO గ్రౌండ్ లో ఆదివారం జరిగే ‘ధర్మ యుద్ధ సభ’ కోసం ఎన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తుడుందెబ్బ జిల్లాధ్యక్షుడు పెందోర్ దాదిరావు తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి వేలాది సంఖ్యలో ఆదివాసీలు రానున్నారని పేర్కొన్నారు. వారికి ప్రత్యేక భోజనం, వాహనాల కోసం పార్కింగ్ స్థలం ఏర్పాటు చేశామని సూచించారు.