SKLM: పోక్సో కేసుల విచారణను 60 రోజుల్లోగా పూర్తి చేయాలని ఎస్పీ మహేశ్వర్ రెడ్డి ఆదేశించారు. ఇవాళ తన కార్యాలయంలో పోలీస్ అధికారులతో సమావేశం నిర్వహించారు. పోక్సో కేసుల్లో సత్వర న్యాయం అందించడమే లక్ష్యంగా పనిచేయాలని అన్నారు. బాధితులకు న్యాయం చేయడంలో జాప్యం జరగకూడదన్నారు. లోక్ అదాలత్ ద్వారా రాజీ పడదగిన కేసులను పరిష్కరించాలన్నారు.