ELR: కొయ్యలగూడెం వేలం కేంద్రంలో రూ. 530 కోట్లతో వర్జీనియా పొగాకు కొనుగోళ్లు చేసినట్లు ఏఎస్ గ్రేసీ మార్గేట్ శనివారం తెలిపారు. మొత్తంగా 192 రోజులలో 17.87 మిలియన్ కేజీల పొగాకు రైతుల వద్ద నుంచి కొనుగోలు చేశామన్నారు. సుమారు 25 కంపెనీలు ప్రాతినిధ్యం వహించాయన్నారు. రూ. 453 అత్యంత గరిష్ట ధరతో రికార్డు పలికిందన్నారు. సరాసరి ధర రూ.296 రూపాయలు వచ్చిందన్నారు.