KMM: మహిళా సాధికారతే తమ ప్రభుత్వ లక్ష్యమని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. బోనకల్ మండలంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పర్యటించి, ఇందిర మహిళా డైరీ గ్రౌండ్ లెవలింగ్ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని వారు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తదితరులు పాల్గొన్నారు.