TG: ఈ నెల 29న దీక్షా దివస్ను ఘనంగా నిర్వహించాలని మాజీ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. దశాబ్దంన్నర క్రితం ‘కేసీఆర్ తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో’ అనే నినాదంతో దీక్ష చేపట్టిన రోజును పురస్కరించుకుని ఈ నెల 29న దీక్షా దివస్ను నిర్వహించాలని తెలిపారు. ఇందుకు సంబంధించి ఈ నెల 26న అన్ని జిల్లాల్లో ముఖ్యనాయకులతో సన్నాహక సమావేశాలు నిర్వహించనున్నారు.