National Voter’s Day: జాతీయ ఓటర్ల దినోత్సవం.. థీమ్, ప్రాముఖ్యత
ఓటు హక్కు అనేది కత్తి కన్నా పదునైనది అందుకే దాన్ని అందరు వినియోగించుకోవాలని ప్రతీ ఏటా జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని కేంద్ర ఎన్నికల కిమిషన్ నిర్వహిస్తుంది. దీనిలో భాగంగా ప్రతీ సంవత్సరం ఒక కొత్త థీమ్‌తో ముందుకొస్తుంది. మరి ఈ సంవత్సరం థీమ్ ఏంటో చూద్దాం.
National Voter’s Day: ఓటు హక్కు.. 18 సంవత్సరాలు నిండిన యువతీయువకులకు భారత రాజ్యంగం ఓటు హక్కును కల్పించింది. అది కత్తి కంటే పదునైన ఆయుధం అని ఎందరో ప్రముఖులు చెప్పారు. దాన్ని సరైన పద్దతిలో వాడకపోతే 5 సంవత్సరాల పాటు మన దేశం, మన ప్రాంతం వెనకబడుతుంది. అందుకే ప్రతీ ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహిస్తుంది. ప్రతి సంవత్సరం జనవరి 25న ఈ కార్యక్రమం జరుపుకుంటారు. దీనిలో భాగంగా పౌరులకు ఓటు పట్ల అవగాహన కల్పించడం, వారు ఓటు హక్కును వినియోగించుకునేలా పలు కార్యక్రమాలు చేపడుతుంది.
భారత దేశంలో జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని మొదటి సారిగా 2011 జనవరి 25 అప్పటి రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ ప్రారంభించారు. అప్పటి నుంచి ప్రతీ ఏటా జనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నారు. అందుకని ప్రతీ సంవత్సరం ఓ సరికొత్త నినాదంతో కేంద్ర ఎన్నికల కమిషన్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఓటు హక్కులాంటిది మరోకటి లేదు, నేను కచ్చితంగా ఓటేస్తా అనేది ఈ ఏడాది ఎంచుకున్న థీమ్. అయితే మనకు స్వాతంత్య్రం వచ్చిన తరువాత భారత రాజ్యంగాన్ని 1949 నవంబర్ 26న అమోదించారు. 1950 జనవరి 25న కేంద్ర ఎన్నికల సంఘాన్ని స్థాపించారు. ఆ తరువాతి రోజు అనగా జనవరి 26న రాజ్యంగం అమలులోకి వచ్చింది. అందుకే ఓటర్ల దినోత్సవాన్ని ఏటా జనవరి 25న నిర్వహిస్తారు. యువతకు ఓటు ప్రాధాన్యత తెలపడం, ఓటింగ్ ప్రక్రియాలో వారిని పాల్గొనెలా ప్రోత్సహించడం దీని ప్రధాన లక్ష్యం.