»Case Against Rahul Gandhi In Assam Transferred To Cid
Rahul Gandhi: రాహుల్ గాంధీపై కేసు సీఐడీకి బదిలీ
భారత్ జోడో న్యాయ్ యాత్రకు అసోం పోలీసులు అనుమతించనప్పటికీ బారుకేడ్లు తొలగించి ముందుకు వెళ్లినందుకు రాహుల్ గాంధీ, ఇతర కాంగ్రెస్ నేతలపై కేసులు నమోదు చేశారు. తాజాగా ఆ కేసును దర్యాప్తు చేయాల్సిందిగా పోలీసులు సీఐడీకి అప్పగించారు.
Case against Rahul Gandhi in Assam transferred to CID
Rahul Gandhi: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi ) చెపట్టిన భారత్ జోడో యాత్ర విజయవంతం అయిన సంగతి తెలిసిందే. దాంతో భారత్ జోడో న్యాయ్ యాత్ర(Bharat Jodo Nyay Yatra) పేరిట దేశమంత పర్యాటనకు పూనుకున్నారు. ఈ సందర్భంగా అసోంలో ప్రారంభం అయింది. కానీ అసోంలోని గువహటిలో భారత్ జోడో న్యాయ్ యాత్రకు పోలీసుల అనుమతించలేదు. అయినప్పటికీ బారికేడ్లు తొలగించుకుని నగరం మీదుగా వెళ్లేందుకు ప్రయత్నించడంతో రాహుల్ గాంధీతో సహా పలువురి కాంగ్రెస్ నాయకులపై కేసు నమోదైంది. ఈ కేసును దర్యాప్తు చేయాలని అసోం పోలీసులు సీఐడీకి అప్పజెప్పారు. దీని కోసం సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయనుంది.
మరో వైపు లోక్సభ ఎన్నికల ముగిసిన తరువాత రాహుల్ గాంధీ అరెస్టవుతారని అసోం సీఎం హిమంతబిశ్వ శర్మ పేర్కొన్నారు. సిబ్సాగర్ జిల్లలోని నజీరాలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో సీఎం హిమంత మాట్లాడుతూ.. భారత్ జోడో న్యాయ్ యాత్ర, అన్యాయ యాత్ర అని, హింసను ప్రేరేపించేలా ఉందని తెలిపారు. దేశం ప్రశాంతంగా ఉన్న సమయంలో రాహుల్ చేపట్టే కార్యక్రమాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, లోక్ సభ ఎన్నికలు అయిపోయిన తరువాత రాహుల్ అరెస్ట్ అవుతారని వెల్లడించారు.