»Five Soldiers Killed Five Injured As Militants Attack Army Convoy In Jks Kathua
Terror Attack : కథువా ఉగ్రదాడి వారి పనే.. సరిహద్దుల నుంచి దేశంలోకి ఉగ్రవాదులు?
సోమవారం కథువాలో భద్రతా బలగాలపై ఉగ్రవాదులు దాడి చేశారు. జైషే మహ్మద్ అనుబంధ సంస్థ అయిన కశ్మీర్ టైగర్స్ ఈ దాడి చేసినట్లు స్వయంగా ప్రకటించుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
ammu Kashmir Terror Attack : జమ్ము కశ్మీర్ రాష్ట్రంలో ఈ మధ్య కాలంలో ఉగ్ర దాడులు పెరుగుతున్నాయి. భద్రతా బలగాలపై వీరు ఏదో ఒక రూపంలో విరుచుకుపడుతున్నారు. తాజాగా సోమవారం కథువా జిల్లాలో రిక్కీ నిర్వహిస్తున్న సైనికుల వ్యాన్‌పై ఉగ్రవాదులు( militants attack) కాల్పులు జరిపారు. గ్రనైడ్లు విసిరారు. వెంటనే అప్రమత్తం అయిన సైనికులు ఎదురు కాల్పులకు దిగారు. దీంతో వారు సమీపంలోని అటవీ ప్రాంతంలోకి పారిపోయారు. ఈ దాడి జరిపింది తామేనంటూ పాకిస్థాన్‌కి చెందిన నిషేధిత ఉగ్ర సంస్థ జైషే మహ్మద్ అనుబంధ సంస్థ అయిన కశ్మీర్ టైగర్స్ ప్రకటించుకుంది. ఈ దాడి సమయంలో సైనికల వాహనంలో పది ఉంటే అందరికీ గాయాలు అయ్యాయి. చికిత్స తీసుకుంటున్న సమయంలో ఐదుగురు జవాన్లు(Five soldiers) ప్రాణాలు విడిచారు. ఆరో ఐదుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
జవాన్లు కథువాలోని(Kathua) మాచేడి, కిండ్లీ, మల్హార్ రోడ్డులో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ దాడుల కోసం గత కొన్ని రోజుల ముందే దేశ సరిహద్దుల గుండా వీరు భారత్‌లోకి వచ్చి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. వారంతా పక్కా ప్రణాళికతోనే ఈ దాడికి పాల్పడ్డారని చెబుతున్నారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన సైనికులకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సానుభూతి తెలియజేశారు.
అమర వీరులకు హృదయపూర్వకంగా నివాళులు అర్పిస్తున్నట్లు రాహుల్ వెల్లడించారు. గాయపడిన సైనికులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. దేశంలో నెల రోజుల వ్యవధిలో జరిగిన ఐదో దాడి ఇదని రాహుల్ గాంధీ అన్నారు. తీవ్రవాదుల దాడులను ఎదుర్కొనేందుకు గట్టి చర్యలు అవసరం అన్నారు. అంతేతప్ప ఖాళీ ప్రసంగాల వల్ల అవి పరిష్కారం కావని చెప్పారు. ఈ దుఃఖ సమయంలో తాను దేశానికి అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు.