»Banaras Sarees With Ram Mandiram Theme Increased Demand
Banaras sarees: రామమందిరం థీమ్ తో బనారస్ చీరలు.. పెరిగిన డిమాండ్
అయోధ్యలో కేంద్రప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్యకంగా చేపట్టిన రామ మందిరం వలన బనారస్ చీరలకు డిమాండ్ పెరింగి. జనవరి 22న శ్రీరాముడి విగ్రహ ప్రాన ప్రతిష్ట సందర్భంగా ప్రత్యేక డిజైన్‌లో బనారస్ చీరలు కావాలంటే కస్టమర్లు ఫోన్ల్ చేస్తున్నారని వ్యాపారులు చెబుతున్నారు.
Banaras sarees: అయోధ్య(Ayodhya)లో రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా బనారస్ చీరల(Banaras sarees )కు విపరీతమైన డిమాండ్ పెరిగింది. రామ మందిరం(Ram Mandiram) థీమ్ తో ప్రత్యేకమైన డిజైన్ చీరలు నేసివ్వాలంటూ మహిళలు ఆర్డర్లు పెడుతున్నారు. కేంద్రప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రామమందిరం నిర్మాణం పూర్తి అయింది. ఇక జనవరి 22న రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ఉంది. ఈ సందర్భంగా అదే రోజు దేశవ్యాప్తంగా ఉన్న రాముడి ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరగనున్నాయి. అలాగే కోట్లాది శ్రీరామ భక్తులు ఆయన్ను దర్శించుకోవడానికి అయోధ్యకు వెళ్లనున్నారు. గ్రామాల్లో, పట్టణాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా రామ మందిరం థీమ్ తో నేసిన చీరలు ధరించాలని మహిళలు భావిస్తున్నారు. అందుకే బనారస్ వ్యాపారులకు ఆర్డర్లు పెరిగాయి.
కేవలం మన దేశం నుంచి కాదు ప్రపంచం నలుమూలల నుంచి స్పెషల్ చీరలు కావాలంటూ ఫోన్లు వస్తున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. క్వాలిటీ, డిజైన్‌ను బట్టి ఒక్కో చీర ధర రూ.7 వేల నుంచి రూ.లక్ష వరకు ఉంటాయని పేర్కొన్నారు. చారిత్రక విశేషాలను తెలుపుతూ తయారుచేసే చీరలకు యూపీలోని ముబారక్పూర్ ప్రాంతం ప్రత్యేకమైనది. ఇప్పుడు రామమందిరం థీమ్‌తో చీరలను సిద్ధం చేస్తున్నారట. అలాగే పీలి కోఠి ప్రాంతంలో రామ్ దర్బార్ వర్ణన ఉన్న చీరలకు చాలా డిమాండ్ ఉంది. వీటికి అమెరికా నుంచి ఎక్కువ ఆర్డర్లు వస్తున్నాయట.