»Ayodhya Ram Mandhir Deliver On The Auspicious Day Pregnant Women Who Want
Ayodhya Ram Mandhir: ప్రాణప్రతిష్ఠ రోజే డెలివరీ చేయమని కోరుతున్న గర్భిణులు
శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ జరిగే రోజునే తమకు ప్రసవం చేయాలని ఉత్తర్‌ప్రదేశ్‌లో చాలామంది గర్భిణులు వైద్యులను కోరుతున్నారు. ఆ రోజునా పిల్లలు పుడితే తమ ఇళ్లలో రామ్‌లల్లాకి పునర్జన్మ లభించినంత పుణ్యం ఉంటుందని గర్భిణులు తెలుపుతున్నారు.
Ayodhya Ram Mandhir: అయోధ్యలో రామ మందిర ప్రాణప్రతిష్ఠకు అన్ని పనులు చకచక పూర్తిచేస్తున్నారు. అయితే శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ జరిగే రోజునే తమకు ప్రసవం చేయాలని ఉత్తర్‌ప్రదేశ్‌లో చాలామంది గర్భిణులు వైద్యులను కోరుతున్నారు. ఆ రోజునా పిల్లలు పుడితే తమ ఇళ్లలో రామ్‌లల్లాకి పునర్జన్మ లభించినంత పుణ్యం ఉంటుందని గర్భిణులు తెలుపుతున్నారు. కాన్పుర్కి చెందిన ఓ గర్భిణి జనవరి 22న తనకు ప్రసవం చేయాలని వైద్యులను కోరింది. శ్రీరాముడి తల్లి కౌశల్యను స్మరించుకుని తన ఇంట్లో రామ్‌లల్లా పుట్టాలని కోరుకుంటున్నట్లు తెలిపింది. అయితే ఆ రోజు ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉన్న మహిళలందరికీ ఆపరేషన్ చేసేలా ప్రయత్నిస్తామని డాక్టర్ హామీ ఇచ్చారు.
సాధారణంగా ఆ ఆసుపత్రిలో ప్రతిరోజూ 12 నుంచి 20 ప్రసవాలు జరుగుతాయి. జనవరి 22న మరిన్ని ఆపరేషన్లు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 22వ తేదీన మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషాలకు ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరగనుంది.