»Husband Rips Wifes Stomach To See If She Has A Daughter Or Son In The Womb
Shocking : పుట్టేది ఆడో మగో తెలుసుకునేందుకు భార్య కడుపు చీల్చిన భర్త
ఉత్తరప్రదేశ్ లో ఓ షాకింగ్ కేసు వెలుగు చూసింది. తనకు పుట్టబోయే బిడ్డ ఆడ మగ తెలుసుకోవాలని ఓ తండ్రి అనుకున్నాడు. కొడుకు కావాలనే కోరికతో ఆ వ్యక్తి తన ఎనిమిది నెలల గర్భిణి అయిన భార్య కడుపు కోశాడు.
Uttarpradesh : ఉత్తరప్రదేశ్ లో ఓ షాకింగ్ కేసు వెలుగు చూసింది. తనకు పుట్టబోయే బిడ్డ ఆడ మగ తెలుసుకోవాలని ఓ తండ్రి అనుకున్నాడు. కొడుకు కావాలనే కోరికతో ఆ వ్యక్తి తన ఎనిమిది నెలల గర్భిణి అయిన భార్య కడుపు కోశాడు. భార్య అనుమతి లేకుండానే నిందితుడు ఈ చర్యకు పాల్పడ్డాడు. కొడవలితో దారుణంగా కడుపు కోశాడు. చంపేందుకు కూడా ప్రయత్నించాడు. ఈ ఘటన సరిగ్గా నాలుగేళ్ల క్రితం అంటే 2020లో చోటు చేసుకుంది. ఈ ఘటనలో కోర్టు నిందితుడికి ప్రస్తుతం జీవిత ఖైదు విధించింది.
ఈ ఘటన బదౌన్ లోని నెక్‌పూర్ ప్రాంతంలో చోటుచేసుకుంది. నిందితుడిని పన్నాలాల్గా గుర్తించారు. పన్నాలాల్ కొడవలితో తన భార్య(35) పొట్టను కోసి తీవ్రంగా గాయపరిచాడు. ఘొంచా గ్రామానికి చెందిన గోలు 2020 సెప్టెంబర్ 19న సివిల్ లైన్ కొత్వాలి పోలీసులకు కంప్లైంట్ చేశాడు. తన సోదరి అనితకు 22 ఏళ్ల క్రితం మొహల్లాలో నివసిస్తున్న నంద్ లాల్ కుమారుడు పన్నా లాల్‌తో పెళ్లి అయిందని చెప్పాడు. తర్వాత ఆ దంపతులకు ఐదుగురు ఆడపిల్లలు జన్మించారు. ఈ సారైనా తనకు కొడుకు కావాలని బలంగా కోరుకున్నాడు. అందుకే పన్నా లాల్ ఎప్పుడూ ఆమెపై కోపంగా ఉండేవాడు. అనితను పలుమార్లు వేధింపులకు గురిచేశాడు. ఈ విషయాన్ని అనిత తన పుట్టింటికి తెలియజేసింది. అనితను ఈ సారి ఆడపిల్లకు జన్మనిస్తే వేరే పెళ్లి చేసుకుంటానని బెదిరించేవాడు.
2020 సెప్టెంబర్ 22న సాయంత్రం 4 గంటల ప్రాంతంలో పన్నా లాల్ అనితకు పుట్టబోయేది ఆడ మగ తెలుసుకునేందుకు ఆమెపై దాడి చేశాడు. కొడవలితో కడుపు కోశాడు. అనిత తీవ్రంగా గాయపడింది. గాయపడిన మహిళను ఆసుపత్రికి తరలించారు. నిందితుడిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కేసు దర్యాప్తులో కొడవలిని స్వాధీనం చేసుకున్నారు. అప్పటి నుంచి కేసు కోర్టులో పెండింగ్‌లో ఉంది. గురువారం పైన పేర్కొన్న ఫైల్లోని సాక్ష్యాలను పరిశీలించి, ఏడీజీసీ మునేంద్ర ప్రతాప్ సింగ్.. డిఫెన్స్ న్యాయవాది వాదనలు విన్న న్యాయమూర్తి నిందితుడు పన్నా లాల్‌కు శిక్ష విధించారు.