Onion Prices : దేశ వ్యాప్తంగా ఉల్లి సరఫరా తగినంతగా కావడం లేదు. డిమాండు ఎక్కువగా ఉండటం, సరుకు తక్కువగా ఉండటంతో వీటి ధరలకు మళ్లీ రెక్కలు వచ్చాయి. గత రెండు, మూడు వారాల నుంచి వీటి ధరలు(Prices) 50 శాతం మేర పెరిగాయి. దేశంలోనే అతి పెద్ద ఉల్లిపాయల మార్కెట్ అయిన నాసిక్‌లో సోమవారం కిలో ఉల్లి ధర రూ.26కు చేరుకుంది. రెండు వారాల క్రితం ఈ ధర రూ.17గా ఉండేది.
రబీ దిగుబడులు తగ్గితే అంచనాలకు మించి ధరలు(Prices) పెరిగే అవకాశం ఉంది. దీంతో చాలా మంది రైతులు గోదాముల్లో ఉల్లి నిల్వలను బయటకు తీయడం లేదు. ఈ నేపథ్యంలో మార్కెట్లో ఉల్లిపాయలకు డిమాండ్ నెలకొంది. అందుకు తగ్గ సరఫరా లేకపోవడంతో ఎక్కడికక్కడ రేట్లు పెరిగాయి. నాణ్యమైన ఉల్లిపాయలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా రూ.30 నుంచి రూ.40 వరకు అమ్ముడవుతుండటం గమనార్హం.
మహారాష్ట్రలో పండే ఉల్లి పంటను దక్షిణాది రాష్ట్రాల వారు చాలా ఇష్టంగా తింటారని నాసిక్ ఉల్లి వ్యాపారుల్లో ఒకరైన వికాస్ సింగ్ తెలిపారు. ధరలు(Prices) పెరుగుతాయన్న రైతుల అంచనాలతో రైతులు పెద్ద ఎత్తున ఉల్లిపాయల్ని(Onions) నిల్వ చేస్తున్నారని అన్నారు. ఫలితంగానే ధరలు ఇలా ఎగబాకుతున్నాయని తెలిపారు. వర్షా కాలం కావడంతో రాబోయే రోజుల్లో ఉల్లి మరింత పెరిగే అవకాశాలు ఉంటాయని అంటున్నారు.