»Spacebug Detected At Space Station Sunita Williams Health In Trouble
Spacebug: స్పేస్ స్టేషన్లో ఏ మందులకూ లొంగని స్పేస్ బగ్! ఆస్ట్రోనాట్లకు డేంజరే!
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి ఎలా ఎంటరైందో తెలియదు కాని ఓ బ్యాక్టీరియా ప్రవేశించింది. ఆ స్పేస్ బగ్ వల్ల ఆస్ట్రోనాట్ల ఆరోగ్యం ప్రమాదంలో పడే అవకాశం ఉందని నాసా వెల్లడించింది.
International Space station : అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఇప్పుడ భారత సంతతి ఆస్ట్రోనాట్ సునీతా విలియమ్స్‌తో పాటు మరి కొందరు ఆస్ట్రోనాట్లు ఉన్నారు. అయితే ఇప్పుడు ఆ స్పేస్ స్టేషన్లో ఓ సూపర్ బగ్(Spacebug) ప్రవేశించిందని నాసా వెల్లడించింది. దాని వల్ల స్టేషన్‌లోని ఆస్ట్రోనాట్ల ఆరోగ్యానికి ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని తెలిపింది. అది ఊపిరితిత్తులకు హాని కలిగించే బ్యాక్టీరియా అని పేర్కొంది. అంతరిక్ష కేంద్రంలోని వాతావరణానికి సైతం అది అలవాటు పడి ఉందని చెప్పింది. అందుకనే దాన్ని స్పేస్ బగ్ అంటూ అంతా పిలుస్తున్నారు.
ఈ బ్యాక్టీరియా రకాలు స్పేస్ స్టేషన్లో వాతావరణాన్ని తట్టుకునే శక్తిని డవలప్ చేసుకుంటున్నట్లు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అయితే ఇది స్పేస్ నుంచి వచ్చిందని కాదని తేల్చారు. నాసా శాస్త్రవేత్తల కూడానే భూమి నుంచి స్పేస్‌లోకి ప్రయాణించి ఉంటుందని భావిస్తున్నారు. దీన్ని ఎంటిరోబ్యాక్టర్ బుగండెన్సిస్కు(Enterobacter bugandensis) చెందిన బ్యాక్టీరియాగా గుర్తించారు. దీనిలో 13 రకాల స్ట్రెయిన్లను ఇప్పుడు నాసా వారు అధ్యయనం చేస్తున్నారు.
ఈ స్పేస్ స్టేషన్( space station) బ్యాక్టీరియాపై డాక్టర్ కస్తూరి వెంకటేశ్వరన్… కాలిఫోర్నియాలోని నాసా జెట్ ప్రొపల్సన్ ల్యాబ్‌లో పరిశోధనలు చేస్తున్నారు. ఈ జీవి మల్టీ డ్రగ్ రెసిస్టెన్స్‌తో ఉందన్నారు. అందువల్లనే దీన్ని సూపర్ బగ్ అని పిలవాల్సి వస్తోందని నాసా చెబుతోంది. ఈ బ్యాక్టీరియా ఆస్ట్రోనాట్ల ఊపిరితిత్తులకు సోకితే వారి ఆరోగ్యాలకు అక్కడ ఇబ్బందులు(health trouble) తలెత్తే అవకాశాలు ఉంటాయి. దీనిపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.