»Kannada Star Hero Darshan Arresetd In Murder Case
Arrest : మర్డర్ కేసులో ఆ హీరోను అరెస్టు చేసిన పోలీసులు
ఓ స్టార్ హీరోను పోలీసులు మర్డర్ కేసులో అరెస్టు చేయడం సంచలనంగా మారింది. కన్నడ స్టార్ హీరో అయిన అతడు ఇలా మర్డర్ కేసులో అరెస్టవ్వడం ఏమిటంటూ ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ చదివేయండి.
Hero Darshan Arrest : ఫాం హౌస్‌లో ఉన్న కన్నడ ఛాలెంజింగ్ స్టార్ దర్శన్‌ను మర్డర్ కేసులో పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం ఉదయం మైసూర్లో ఈ ఘటన చోటుచేసుకుంది. దర్శన్(DARSHAN ) సహా మరో పది మందిని ఈ కేసులో అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. రేణనుకా స్వామి అనే వ్యక్తికి సంబంధించిన హత్య కేసు అది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
కర్ణాటకలోని సుమన్న హళ్లి వంతెన సమీపంలో ఓ గుర్తు తెలియని మృత దేహం దొరికింది. జూన్ 9న దొరికిన ఈ మృత దేహానికి సంబంధించి పోలీసులు సమాచారం అందుకుని కేసు నమోదు చేశారు. తర్వాత ఆ మృత దేహం రేణుకా స్వామిదిగా గుర్తించారు. ఆయన ఓ ఫార్మా కంపెనీలో పని చేసే వారు. ఈ మర్డర్ కేసు దర్యాప్తులో భాగంగా కొంత మంది అనుమానితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు(ARREST) చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఈ క్రమంలోనే హీరో దర్శన్‌ను(DARSHAN) కూడా పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్లారు. హీరో ఇంటి దగ్గర సైతం భారీగా బందోబస్తును ఏర్పాటు చేశారు. దర్శన్ కన్నడ నటి పవిత్ర గౌడతో రిలేషన్లో ఉన్నట్లు గతంలో గుసగుసలు వినిపించాయి. దీంతో పవిత్ర గౌడ, దర్శన్ భార్య విజయ లక్ష్మి మధ్య వివాదం కూడా నడిచింది. ఈ క్రమంలో రేణుకా స్వామి సైతం పవిత్ర గౌడపై సోషల్ మీడియా వేదికలపై కించపరిచే విధంగా మాట్లాడారట. ఆమెకు అసభ్యకరమైన మెసేజ్‌లు సైతం పంపారట. ఈ నేపథ్యంలోనే రేణుకా స్వామి హత్య జరిగినట్లు వార్తలు వెలువడుతున్నాయి.