»Renuka Swamys Murder Case Darshan Paid Rs 30 Lakh To Cover Up Crime
Darshan : శవాన్ని మాయం చేసేందుకు రూ.30లక్షలు ఇచ్చానన్న హీరో దర్శన్!
హత్య కేసులో అరెస్టైన కన్నడ హీరో దర్శన్ శవాన్ని మాయం చేసేందుకు రూ.30లక్షలు ఇచ్చినట్లు ఒప్పుకున్నారని పోలీసులు చెబుతున్నారు. ఈ కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇక్కడున్నాయి చదివేయండి.
Darshan : రేణుకా స్వామి హత్య కేసులో అరెస్టైన కన్నడ నటుడు దర్శన్ వాంగ్మూలాన్ని పోలీసులు తీసుకున్నారు. హత్య చేసిన రేణుకా స్వామి మృత దేహాన్ని మాయం చేయమంటూ తాను ఒకరికి రూ.30 లక్షలు ఇచ్చానని ఆయన స్వయంగా ఒప్పుకున్నారని పోలీసులు చెబుతున్నారు. ఈ హత్య వ్యవహారంలో తన పేరు ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రాకూడదని దర్శన్ కోరినట్లు పోలీసులకు తెలిపారు. దీంతో ఈ కేసుకు సంబంధించిన నిజాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి.
ఈ కేసులో పకడ్బంధీగా ఆధారాలను సేకరించేందుకు నిందితులందరికీ డీఎన్ఏ టెస్టులు నిర్వహించారు. దర్శన్(DARSHAN) సహా అరెస్టైన మొత్తం 9 మందికి బెంగళూరులోని విక్టోరియా ఆస్పత్రిలో డీఎన్ఏ పరీక్షలు నిర్వహించారు. ఈ మర్డర్ కేసుకు( MURDER CASE) సంబంధించి మరిన్ని ఆధారాలను సేకరించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. ఈ కేసు విషయంలో కర్ణాటక సీఎం సిద్ధ రామయ్య సైతం స్పందించారు. దర్శన్‌ను ఈ కేసు నుంచి బయట పడేయాల్సిందిగా తనపై ఒత్తిడి తెస్తున్నారంటూ వెలువడుతున్న వార్తల్ని ఆయన ఖండించారు. ఈ కేసు విషయంలో తన వరకు ఎలాంటి అభ్యర్థనా రాలేదని తెలిపారు.
అసలు కేసు ఏంటంటే… కన్నడ నటుడు దర్శన్‌కు గతంలోనే పెళ్లైంది. అయినా ఆయన పదేళ్లుగా పవిత్రా గౌడ్‌తో(PAVITHRA GOWDA) సహజీవనం సాగిస్తున్నారు. ఈ విషయంలో దర్శన్ కుటుంబంలో గొడవలు చోటు చేసుకుంటున్నాయని 28 ఏళ్ల రేణుకా స్వామి(RENUKA SWAMI) కలత చెందాడు. పవిత్ర గౌడ్‌కు సోషల్ మీడియాల్లో అసభ్యకరంగా పోస్టు పెట్టాడు. ఈ క్రమంలో వారి మధ్య చోటు చేసుకున్న గొడవ చివరికి అతడి హత్యకు దారి తీసింది. హత్యకు ముందు అతడిని దారుణంగా హింసించినట్లు, కరెంట్ షాక్‌లు ఇచ్చినట్లు శవ పరీక్షలో తేలింది. ఈ కేసులో పోలీసులు ఇప్పటి వరకు 17 మంది నిందితులను అరెస్టు చేసి విచారణ చేపట్టారు.