CTR: సురూర్ ఎ ఉర్దూ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా పుంగనూరులోని పాఠశాలల్లో వ్యాసరచన పోటీలు నిర్వహించారు. మంగళవారం పట్టణంలోని ఉర్దూ పాఠశాల, మదరసాలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉర్దూ భాష అభివృద్ధి అంశంపై వ్యాసరచన, వకృత్వ పోటీలు నిర్వహించినట్లు లైబ్రేరియన్ నసీబ్ జాన్ తెలిపారు. గెలుపొందిన విద్యార్థులకు ముగింపు రోజున బహుమతులు పంపిణీ చేయడం జరుగుతుందని చెప్పారు.