Gold Rates Today : స్వల్పంగా పెరిగిన బంగారం, రూ.1400కుపైగా పెరిగిన వెండి ధరలు
బంగారం, వెండి ధరలు ఈరోజు కూడా అప్ట్రెండ్లోనే నడుస్తున్నాయి. పసిడి స్వల్పంగా పెరగ్గా, వెండి మాత్రం భారీగానే పెరిగింది. దేని ధర ఎంత ఉందనేది తెలుసుకోవాలంటే ఈ కథనం చదివేయండి.
Gold and Silver Rates Today : బంగారం కొనుక్కోవాలని అనుకునే వారు దీని రోజు వారీ రేటును తప్పకుండా గమనిస్తూ ఉండాల్సిందే. అప్పుడే కాస్త తక్కువ ధరకు దీన్ని కొనుక్కునే అవకాశం ఉంటుంది. దేశీయ మార్కెట్లో గురువారం బంగారం ధర కాస్త పెరిగింది. నేడు స్వల్పంగా రూ.176 పెరగడంతో 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.73,950కి చేరుకుంది.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడల్లోనూ పది గ్రాముల పసిడి ధర(Gold Rate) రూ.73,950గానే కొనసాగుతోంది. అయితే ఈ ధరలు మార్కెట్ ప్రారంభ సమయంలో ఉన్నవి మాత్రమే అని వినియోగదారులు గుర్తుంచుకోవాలి. నగల్ని కొనుక్కునేప్పుడు ఈ ధరకు అదనంగా జీఎస్టీ, మజూరీల్లాంటివి తోడవుతాయని గమనించుకోవాలి.
ఇక దేశీయ మార్కెట్లలో వెండి ధర(Silver Rate)లు గురువారం భారీగా పెరిగాయి. ఒక్కరోజే ఏకంగా రూ.1405 పెరగడంతో గురువారం కేజీ వెండి ధర రూ.92,220కి చేరింది. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడల్లోనూ దీని ధర ఇలాగే కొనసాగుతోంది.
అంతర్జాతీయ మార్కెట్లోనూ వీటి ధరలు పెరిగాయి. ఔన్సు స్పాట్ గోల్డ్ ధర 5 డాలర్లు పెరిగి, 2334 డాలర్లకు చేరుకుంది. అలాగే వెండి ధర ప్రస్తుతం 30.14 డాలర్లుగా ఉంది.