Melinda French Gates Divorce : మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్‌తో విడాకులు తీసుకోవడం తన జీవితంలో అత్యంత బాధాకరమైన విషయం అని ఆయన మాజీ భార్య మెలిందా ఫ్రెంచ్ గేట్స్(Melinda French Gates) అన్నారు. 2021లో బిల్‌గేట్స్, మెలిందాలు విడాకులు తీసుకున్నారు. ఈ విషయమై ప్రైవేట్ వ్యక్తులతో ఆమె అక్కడక్కడా మాట్లాడినప్పటికీ బహిరంగంగా ఎప్పుడూ స్పందించలేదు. తొలిసారి ఆమె ఓ ఇంటర్య్వూలో ఈ విషయమై పబ్లిక్‌గా స్పందించారు.
తన భర్తతో విడాకులు(Divorce) తీసుకోవడం చాలా బాధాకరమని అన్నారు. అయితే ఆ తర్వాత తన జీవితం అద్భుతంగా సాగుతోందని, తాను చాలా ఆనందంగా ఉన్నానని మెలిందా చెప్పుకొచ్చారు. చిన్న చిన్న పనులను సైతం తానే స్వయంగా చేసుకుంటున్నానని అన్నారు. మెడికల్ స్టోర్లకు వెళ్లడం, నిత్యవసర సరుకుల్ని స్టోర్లకు వెళ్లి తెచ్చుకోవడం, నచ్చిన చోట తినడం లాంటివన్నీచేసుకుంటున్నానని ఆమె చెప్పారు. ఇలాంటి చిన్న చిన్న ఆనందాలతో తన జీవితం ఇప్పుడు చాలా సంతోషంగా ఉందంటూ చెప్పుకొచ్చారు.
విడాకులు తీసుకోవడానికి ముందే కొన్ని రోజులుగా బిల్‌గేట్స్(Bill Gates) దంపతులు ఇద్దరూ వేరు వేరుగా ఉంటూ వచ్చారు. లైంగిక వేధింపుల కేసులో నేరస్థుడిగా ఉన్న జెఫ్రీ ఎప్స్టీన్తో బిల్ గేట్స్ దగ్గరగా మెలగడం మెలిందాకి నచ్చలేదని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ విభేదాలే పెద్దవై క్రమంగా ఇద్దరి మధ్య దూరం పెరిగిందని వాల్‌స్ట్రీట్ జర్నల్ అప్పట్లో రాసుకొచ్చింది. దీంతో 1994లో వివాహం చేసుకున్న వీరు 2021లో విడిపోయారు. వీరికి ముగ్గురు పిల్లలున్నారు. ముగ్గురూ 20 ఏళ్లకు పైబడిన వారే.