Darshan: కన్నడ సినీ పరిశ్రమలో పేరు గాంచిన హీరో దర్శన్ ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. ఓ హత్య కేసులో దర్శన్‌ను కన్నడ పోలీసులు అరెస్టు చేశారు. చిత్రదుర్గకు చెందిన రేణుక స్వామి అనే వ్యక్తి హత్య కేసులో దర్శన్ ప్రమేయం ఉన్నట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు. దర్శన్‌కు విజయలక్ష్మి అనే మహిళతో కొన్నేళ్ల క్రితం వివాహం అయింది. వీరిద్దరికీ ఓ కుమారుడు కూడా ఉన్నాడు. లేడీస్ మ్యాన్ అయిన దర్శన్ అనేక మందితో అఫైర్లు నడిపేవాడని కన్నడ సినీ పరిశ్రమలో అనేక మందికి తెలుసు. ఓ సినిమాకు ఆడిషన్ కోసం వచ్చిన పవిత్ర గౌడ అనే అమ్మాయితో సాన్నిహిత్యం పెంచుకున్నాడు.
చదవండి:Chiranjeevi: స్టేజీపై ప్రధాని అలా మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది..చిరంజీవి
సినీ పరిశ్రమలో అడుగు పెట్టకముందే పవిత్ర గౌడకు వివాహం అయింది. ఒక పాప కూడా ఉంది. భర్త చాలీచాలని జీవితంతో ఆమె సంతృప్తి చెందలేదు. రంగల ప్రపంచంవైపు ఆకర్షితురాలయింది. భర్తకు విడాలకులిచ్చేసి బెంగళూర్ చేరుకుంది. సీరియల్స్ లో నటించడం మొదలు పెట్టింది. లో బడ్జెట్ మూవీస్‌లో కూడా నటించింది. వీటి వల్ల వచ్చే డబ్బులు సరిపోకపోవడంతో కొంత కాలం పాటు సేల్స్ గర్ల్ ఉద్యోగం కూడా చేసింది. ఈ క్రమంలో కన్నడ స్టార్ దర్శన్ సినిమాకు ఆడిషన్లు జరుగుతున్నాయని తెలిసి తన అదృష్టం పరీక్షించుకోడానికి అక్కడి వెళ్లింది. తన అభిమాన హీరోను నేరుగా కలిసింది. అక్కడి నుంచి దర్శన్‌కి రెగ్యులర్‌గా టచ్‌లోనే ఉండేది. చనువు పెంచుకుంది. తన ఇంటికి డిన్నర్ ఆహ్వానించింది. రెగ్యులర్‌గా కలుసుకోవడంతో వారిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. ఒకరంటే ఒకరికి ఇష్టం పెరిగింది. దర్శన్ అవసరాలను తీర్చడమే ఆమెకు ప్రధాన వ్యాపకంగా మారింది. దీంతో సీరియల్స్, సినిమాలకు దూరంగా ఉండేది. దర్శన్ ఫామ్‌హౌస్‌లోనే ఎక్కువుగా ఉండేది. దర్శన్‌కు అన్నివిధాలుగా సేవలు చేస్తూ వచ్చేది. లేడీస్ మ్యాన్ అయిన దర్శన్ మత్తు మందులకు బానిసగా మారాడు. ఈ వ్యవహారాలు ఇలా సాగుతుండగా… తన భార్యను నిర్లక్ష్యం చేయడం మొదలు పెట్టాడు. ఆమెను అనేక సార్లు కొట్టి హింసించేవాడు. ఒకసారి ఏకంగా తన వద్ద ఉన్న గన్‌తో ఆమెను షూట్ చేశాడు. కాస్తలో బుల్లెట్ గురి తప్పింది. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. దర్శన్‌పై కేసు నమోదు చేసింది.
భార్య తనపై కేసు పెట్టినప్పటికీ… దర్శన్ తన వైఖరిని మార్చుకోలేదు. లేడీస్ మ్యాన్ అయిన దర్శన్ అనేక మంది మహిళలతో చొరవగా ఉండేవాడు. వాళ్లకు కావలసిన డబ్బును ఇవ్వడంతో పాటు మంచి మంచి గిఫ్ట్‌లను కూడా ఇస్తూ వారిని గ్రిప్‌లో పెట్టుకునేవాడు. ఇవన్నీ గమనించిన భార్య విజయలక్ష్మి… మరోసారి పోలీసులను ఆశ్రయించి కేసు పెట్టింది. మొదటి భార్య వల్ల మూడుసార్లు జైలుకు వెళ్లిన దర్శన్ … తాజాగా తన ప్రియురాలు పవిత్రా గౌడ్ కారణంగా నాల్గవసారి జైలుకు వెళ్లాల్సి వచ్చింది.
చిత్ర దుర్గకు చెందిన రేణుకస్వామి అనే 32 ఏళ్ల వ్యక్తి దర్శన్‌కు వీరాభిమాని. దర్శన్ తన భార్యను వదిలేసి వేరే యువతితో కలిసి ఉంటున్నాడే విషయాన్ని జీర్ణించుకోలేకపోయాడు. దర్శన్‌ను లొంగదీసుకున్న పవిత్ర గౌడపై కక్ష పెంచుకున్నాడు. ఆమె సోషల్ మీడియా అకౌంట్లను రెగ్యులర్‌గా ఫాలో అవుతూ…. బ్యాడ్ కామెంట్స్ పెట్టేవాడు. బ్యాడ్ కామెంట్స్ చేస్తే దర్శన్‌ను ఆమె వదిలేస్తుందని …రేణుకస్వామి భావించాడు. తన ఐడీని అనేక సార్లు మార్చి బ్యాడ్ కామెంట్స్ పోస్ట్ చేసేవాడు. ఈ మెసేజ్‌లతో విసిగిపోయిన పవిత్ర గౌడ్… ఈ విషయాన్ని దర్శన్‌కు తెలియజేసింది. బ్యాడ్ కామెంట్స్ పెట్టేవారి అకౌంట్స్ బ్లాక్ చేయాలని దర్శన్ ఆమెకు సలహా ఇచ్చాడు. అకౌంట్లను బ్లాక్ చేసినప్పటికీ…రేణుక స్వామిని అడ్డుకోలేకపోయారు. వేరే కొత్త అకౌంట్లను నుంచి అదే పనిగా పవిత్రపై బ్యాడ్ కామెంట్స్ చేస్తుండేవాడు. ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేయకుండా దర్శన్ నేరుగా రంగంలో దిగాడు. తన రౌడీ గ్యాంగ్‌లను కూడా రంగంలో దించాడు. వారికి డబ్బులిచ్చి రేణుకస్వామికి బుద్ది చెప్పాలని భావించాడు. దర్శన్ గ్యాంగ్..రేణుకస్వామి ఆచూకీ తెలుసుకున్నారు. బళ్లారిలో ఉన్న తన అభిమానికి రేణుక స్వామిని చితక్కొట్టే పని అప్పగించారు. దర్శన్ అభిమానులు చాకచక్యంగా వ్యవహరించి… రేణుకస్వామిని కలిశారు. దర్శన్ నిన్ను కలవాలని అనుకుంటున్నాడని రేణుకస్వామిని నమ్మించారు. వారితో పాటు బెంగళూర్ తీసుకువెళ్లారు. దర్శన్ అభిమాని అయిన రేణుకస్వామి బెంగళూర్ వెళుతున్న విషయాన్ని తన భార్యకు కూడా చెప్పకుండా జూన్ 8న బెంగళూర్ వెళ్లాడు.
చదవండి:Mrinal Thakur: బికినీలో మృణాల్.. కుర్రాళ్లు తట్టుకోవడం కష్టమే?
బెంగళూర్‌లోని ఆర్ఆర్ నగర్‌లోని ఓ కారు షెడ్డులోకి రేణుకస్వామిని తీసుకువెళ్లారు. మరో ఎనిమిది మంది కారు షెడ్డుకు చేరుకున్నారు. వీరంతా కలిసి రేణుకస్వామిపై విరుచుకుపడ్డారు. రకరకాల ఆయుధాలతో చితక్కొట్టారు. అదే సమయంలో దర్శన్ కూడా అక్కడకు చేరుకుని రేణుకస్వామిని గట్టిగా తన్నాడు. రేణుకస్వామి ప్రైవట్ పార్ట్‌పై దర్శన్ గట్టిగా తన్నడంతో గిలగిల కొట్టుకున్నాడు. స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయాడు. బెంగళూర్‌లోని రాజ్ కాల్వ అనే పెద్ద డ్రనేజీలో రేణుక స్వామి శవాన్ని విసిరేశారు. దర్శన్ గ్యాంగ్‌లోని ఐదుగురు వ్యక్తులు రేణుకస్వామి శవాన్ని ఆ డ్రైనేజీలో పడేసి పరారయ్యారు. డ్రైనేజీలో నుంచి నదిలోకి కొట్టుకుపోతుందని వారందరూ భావించారు. వారి ప్లాన్ బెడిసికొట్టింది. అక్కడే ఉన్న రాయికి శవం తగులుకొని ఉండిపోయింది. రేణుక స్వామి శవం చుట్టూ చేరిన ఊరకుక్కలు … పీక్కుతినడం చూసిన ఓ సెక్యూరిటీ గార్డ్ ….విషయాన్ని పోలీసులకు తెలియజేశాడు.
సమాచారం అందుకున్న పోలీసులు రంగంలో దిగారు. శవాన్ని పరిశీలించారు. బాడీపై అనేక గాయాలు ఉండడం చూసి అది ఆత్మహత్య కాదని…. హత్యే అయి ఉంటుందని నిర్ణారణకు వచ్చారు. కేసును నమోదు చేసి విచారణ ప్రారంభించారు. దగ్గర్లో ఉన్న సీసీ టీవీ రికార్డులను పరిశీలించారు. రేణుకస్వామి డెడ్‌బాడీని పారేయడానికి వచ్చిన ఐదుగురిని గుర్తించారు. ఈ క్రమంలో ఆ ఐదుగురు నేరుగా పోలీసులను కలిశారు. 10 లక్షల విషయంలో రేణుకస్వామితో తమకు వివాదం ఉందని పోలీసులను నమ్మించే ప్రయత్నం చేశారు. దర్శన్‌ను కాపాడేందుకు ఈ డ్రామా ఆడారు. ఈ ఐదుగురు చెప్పేది నమ్మని పోలీసులు … రేణుకస్వామి గురించి తెలుసుకోవడం మొదలు పెట్టారు. దీంతో అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి.దర్శన్ … పవిత్ర గౌడను రెండో పెళ్లి చేసుకున్నాడని….పవిత్ర గౌడను రేణుకస్వామి సోషల్ మీడియాలో వేధించడం వల్లే తమతో హత్య చేయించాడని ఆ ఐదుగురు పోలీసుల ముందు ఒప్పుకున్నారు.
ఆ ఐదుగరు ఇచ్చిన సమాచారంతో దూకుడు పెంచిన పోలీసులు…..దర్శన్‌ను విచారించేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయం తెలుసుకున్న దర్శన్…పవిత్ర గౌడ్‌ను తీవ్రంగా కొట్టాడు. నీ వల్లే నాకు ఈ అవస్థలు వచ్చాయని పవిత్రపై చేయిచేసుకున్నాడు. దీంతో ఆమె స్పృహ తప్పి కింద పడిపోయింది. వెంటనే తేరుకున్న దర్శన్ ఆమెను RR ఆసుపత్రిలో చేర్చాడు. చికిత్స అందించాడు. ఆమె పరిస్థితి క్రిటికల్‌గా ఉందని తెలిసినప్పటికీ ఆసుపత్రి నుంచి వెంటనే డిశ్చార్జ్ చేయించాడు. మైసూర్‌లోని తన ఫామ్ హౌస్‌కు తీసుకుపోయాడు. దర్శన్‌పై నిఘా ఉంచిన పోలీసులు నేరుగా మైసూర్‌లోని అతడి ఫామ్ హైస్‌కి వెళ్లి విచారణ చేశారు. దర్శన్ తడబడడంతో అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దర్శన్ ఈ హత్య చేశాడని, చేయించాడని గానీ తేలితే.. కనీసంలో కనీసం పదేళ్లు జైలు శిక్ష పడే అవకాశాలుంటాయని న్యాయ నిపుణులు చెబుతున్నారు.