Cheap Song Promo Kannada: ఉపేంద్ర చీప్ సాంగ్.. ఇదేదో తేడాగా ఉందే? అన్నీ డబుల్ మీనింగ్లేనా?
కన్నడ హీరో ఉపేంద్ర అంటేనే ఓ సెన్సేషన్. ఉపేంద్ర ఏం చేసిన సంచలనమే. ఇప్పుడు మరో కొత్త ప్రపంచంతో ఆడియెన్స్ ముందుకు రాబోతున్న ఉప్పి.. ఓ చీప్ సాంగ్ ప్రోమోని రిలీజ్ చేయగా.. ఇదేదో తేడాగా ఉందేంటి? అనేలా ఉంది వ్యవహారం.
Cheap Song Promo Kannada: కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర గురించి ప్రత్యేకంగ చెప్పాల్సిన అవసరం లేదు. దర్శకుడిగా, హీరోగా కన్నడ, తెలుగులో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న ఉపేంద్ర.. ఎన్నో A రేటేడ్ సినిమాలతో సెన్సేషన్ క్రియేట్ చేశాడు. అసలు ఉపేంద్ర స్టైలే వేరు. అతని నుంచి సినిమా వస్తుందంటే.. ఆటోమేటిక్‌గా ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. చివరగా కబ్జా మూవీతో పాన్ ఇండియా రేంజ్లో అలరించిన ఉపేంద్ర.. ఇప్పుడు మరో కొత్త ప్రపంచాన్ని పరిచయం చేయబోతున్నాడు. దాదాపు ఏడేళ్లు గ్యాప్ తర్వాత ‘UI’ అనే సినిమాతో మెగాఫోన్ పట్టాడు ఉప్పి. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ రిలీజ్ చేసి అంచనాలు పెంచేశాడు. ఇది ఏఐ వరల్డ్ కాదు.. యూఐ వరల్డ్ అంటు హైప్ పెంచుతున్నాడు. ఉపేంద్ర స్టైల్లో ఊహకు అందని విధంగా ఈ మూవీ తెరకెక్కుతోంది.
లేటెస్ట్గా ఈ సినిమా నుంచి ఓ వెరైటీ సాంగ్ ప్రోమో రిలీజ్ చేశాడు. అంతా చీప్ చీప్.. అంటూ సాగే ఈ లిరికల్ సాంగ్‌ను ఫిబ్రవరి 26న రిలీజ్ చేయబోతున్నారు. నీకంటే నాది పెద్దది, వాడికంటే నీది చిన్నది.. అంటూ డబుల్ మీనింగ్ తరహా లిరిక్స్‌ను ఈ సాంగ్‌లో చూడొచ్చు. ఈ సాంగ్‌ను విరూపాక్ష ఫేమ్ అజనీష్ లోకనాథ్ సంగీతం అందించాడు. సినిమాలో ఈ సాంగ్ ఎలాంటి సందర్భంలో వస్తుందే తెలియదు గానీ.. అంతా చీప్ సాంగ్ ప్రోమో మాత్రం వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో ఈ సాంగ్ ట్రోలింగ్‌కు మంచి స్టఫ్ అయ్యేలా ఉందంటున్నారు. అసలే.. ఇది మాములు సినిమాలా ఉండదని, షాక్ ఇచ్చేలా ఉంటుందని ఉపేంద్ర చెబుతూ వస్తున్నాడు. అందుకు తగ్గట్టే.. ‘UI’ ప్రమోషన్ కంటెంట్‌గా చాలా డిఫరెంట్‌గా ఉంది. మరి ‘UI’ ఫుల్ చీప్ సాంగ్ ఎలా ఉంటుందో చూడాలి.