»Vijay Vijay Fans Who Scared The Music Director Did He Open An Account
Vijay: మ్యూజిక్ డైరెక్టర్‌ను భయపెట్టిన విజయ్ ఫ్యాన్స్? దెబ్బకు అకౌంట్ లేపేశాడు?
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్‌కి రజనీకాంత్ రేంజ్ మాస్ ఫాలోయింగ్ ఉంది. విజయ్ సినిమా వస్తుందంటే చాలు.. ఫ్యాన్స్ అంతా హైపర్ యాక్టివ్ అయిపోతారు. తాజాగా.. విజయ్ ఫ్యాన్స్ దెబ్బకు మ్యూజిక్ డైరెక్టర్ భయపడినంత పని చేశాడు.
Vijay: Vijay fans who scared the music director? Did he open an account?
Vijay: సోషల్ మీడియాలో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఫ్యాన్స్ చేసే రచ్చ మామూలుగా ఉండదు. విజయ్ నుంచి ఏదైనా సినిమా అప్డేట్ వస్తే చాలు.. ఆరోజు సోషల్ మీడియాను కబ్జా చేసేస్తారు విజయ్ ఫ్యాన్స్. ఇక సినిమా రిలీజ్ అయితే ఆన్ లైన్, ఆఫ్ లైన్ అనే తేడా లేకుండా చేసే హంగామా ఓ రేంజ్లో ఉంటుంది. సినిమా నచ్చినా, నచ్చకపోయినా సరే.. సోషల్ మీడియాకు సెగలు పుట్టిస్తుంటారు దళపతి ఫ్యాన్స్. రీసెంట్గా విజయ్ నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ ‘గ్రేటెస్ ఆఫ్ ఆల్ టైం’ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు.
వెంకట్ ప్రభు డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందిస్తున్నాడు. అయితే విజిల్ పోడు అనే సాంగ్ రిలీజ్ అవగా.. విజయ్ ఫ్యాన్స్ సాటిస్ఫై కాలేకపోయారు. యువన్ ఇచ్చిన ట్యూన్ పెద్దగా లేదని కామెంట్స్ చేశారు. ఒక్క విజయ్ ఫ్యాన్స్ అనే కాదు.. నెటిజన్స్ కూడా ఈ సాంగ్ పై ట్రోల్ చేశారు. ఓ రకంగా చెప్పాలంటే.. అనిరుధ్‌తో పోలుస్తూ యువన్‌ను కాస్త గట్టిగానే ట్రోల్ చేశారు. ఓవరాల్‌గా విజిల్ పోడు సాంగ్‌కు అనుకున్నంత రీచ్ రాలేదు. వ్యూస్ కూడా అంతంత మాత్రంగానే వచ్చాయి. దీంతో యువన్ శంకర్ రాజా భయపడినంత పని చేశాడు.
ఏకంగా ఇన్‌స్టా అకౌంట్‌ని డియాక్టివేట్ చేసేశాడు. ఇది ఫ్యాన్స్ ఆన్ లైన్ ఎదురు దాడి వల్లే జరిగిందని కోలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే.. యువన్ నిజంగానే ఈ సాంగ్ కారణంగా సోషల్ మీడియాకు దూరమయ్యాడా? లేదా వేరే కారణమేదైనా ఉందా? అనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. మరి.. విజయ్ ఫ్యాన్స్‌ను మెప్పించేలా యువన్ సెకండ్ సాంగ్ ప్లాన్ చేస్తాడేమో చూడాలి.