»The Trailer Of Kannada Hero Shivraj Kumars Ghost Has Created A Frenzy
Ghost trailer: ట్రెండింగ్‌లో శివరాజ్ కుమార్ హై ఓల్టేజ్ యాక్షన్ ట్రైలర్
కన్నడ సూపర్ స్టార్ డా.శివరాజ్ కుమార్ నటించిన తాజా చిత్రం ఘోస్ట్ ట్రైలర్ రలీజ్ అయింది. పాన్ ఇండియా మూవీగా విడుదలకు సిద్దం అయిన ఘోస్ట్ ట్రైలర్ ఎలా ఉంది? దసరా బరిలో ఉన్న దీని ప్రత్యేకతో ఏంటో ఇప్పుడు చూద్దాం.
The trailer of Kannada hero Shivraj Kumar's Ghost has created a frenzy
Ghost trailer: కన్నడ చిత్ర పరిశ్రమలో హీరో డా.శివరాజ్ కుమార్(Dr. Shivarajkumar)కు ప్రత్యేకమైన స్టార్డమ్ ఉంది. ఆయన కంటూ కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. అందుకే ఆయన్ను అభిమానులు ప్రేమగా శివన్న(Shiavanna) అని పిలుచుకుంటారు. తాజాగా శ్రీని(srini) దర్శకత్వంలో తెరకెక్కిన ఘోస్ట్(Ghost) ట్రైలర్ విడుదలైంది. ఇక ఆ విశేషాలను ఒక సారి గమనిస్తే..యుద్దం మానవ ప్రపంచానికి మానని ఓ గాయం అనే డైలాగ్ తో మొదలవుతుంది. ఇలాంటి యుద్దాల వల్ల సామ్రాజ్య స్థాపన కంటే కూడా..అవి చేసే నష్టాలే ఎక్కువ.. సామ్రాజ్యాలను నిర్మించిన వాడిని చరిత్ర ఎన్నో సార్లు మరిచిపోయి ఉండొచ్చు. కానీ విధ్వంసం సృష్టించే నా లాంటి వాడ్ని మాత్రం చరిత్ర ఎప్పటికీ మరిచిపోదు అనే డైలాగ్‌తో శివ రాజ్ కుమార్ ఎలివేషన్ షాట్స్ అద్భుతంగా ఉన్నాయి. ఈ డైలాగ్ లోనే చాలా డెప్త్ కనిపిస్తుంది. అలాగే శివన్న ఎంట్రీ సీన్స్, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా అదిరిపోయింది. ప్రతి సీన్ చాలా ఇంటెన్స్‌గా అనిపిస్తుంది.
ట్రైలర్లో ఉన్న కొన్ని క్లూస్‌ను బట్టి చూస్తే సినిమా 1962లో జరుగుతుందని తెలుస్తుంది. హీరో ఒక పెద్ద గ్యాంగ్‌స్టర్ అని ఇట్టే కనిపెట్టేయోచ్చు. అలాగే ఆయన చెప్పే చివరి డైలాగ్ నేను ఎవరి జోలికి వెళ్లను. భయంతో కాదు.. నేను వెళ్తే రణరంగం మారణహోమంలా మారుతుందని అనేది ట్రైలర్‌కే హైలెట్‌గా నిలిచింది. ఈ ట్రైలర్లో జయరాం, అనుపమ్ ఖేర్‌లు కూడా చాలా ఇంటెన్స్ పాత్రలలో కనిపిస్తున్నారు. అలాగే యువకుడిలా శివరాజ్ కుమార్ పాత్ర కూడా చాలా ఇంట్రెస్టింగానే ఉంది. కన్నడ, తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం భాషల్లో ఘోస్ట్ అక్టోబర్ 19న దసరాకు ప్రేక్షకుల ముందుకి రానుంది. మరి అదే సమయంలో లియో, భగవంత్ కేసరి వంటి సినిమాలు కూడా ఉన్నాయి. అలాగే మాజ్ మహారాజ్ రవితేజ టైగర్ నాగేశ్వరరావు కూడా రెడీగా ఉంది. ఏది ఏమైనా సినిమాలు బాగుంటే అన్నింటినీ ఆదరిస్తారు సినీ అభిమానులు.