»Varun Tej Who Gave A Bachelor Party In Spain Married Lavanya In A Palace In Italy
Varun Tej: వరుణ్ తేజ్, లావణ్యల వివాహం ఎక్కడో తెలుసా?
వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల పెళ్లి గురించి నెట్టింట్లో తెగ చర్చ నడుస్తుంది. ఏ దేశంలో చేసుకోబోతున్నారు. డేట్ ఏంటి, ఎవరు ముఖ్య అతిథులు ఎవరనే విషయాలతో పాటు ప్రస్తుతం ఈ జంట ఎక్కడ ఉన్నారనే విషాయాలపై నెట్టింట్లో తీవ్ర చర్చ సాగుతుంది.
Varun Tej, who gave a bachelor party in Spain, married Lavanya in a palace in Italy
Varun Tej: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్(Varun Tej), లావణ్య త్రిపాఠి(Lavanya tripathi) ఇద్దరు ప్రేమించుకుని ఇరు కుటుంబ సభ్యులను ఒప్పించి జులై నెలలో నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలిసిందే. ఇద్దరు తమ కెరియర్లో బిజీగా ఉంటున్న సందర్భంలో వారి ప్రేమ వ్యవహారం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టింది. అనేక సందర్భాలాలో వరుణ్ తేజ్ తండ్రి నటుడు నాగబాబు(Nagababu) అలాంటిదేం లేదని చెబుతూనే, ఈ ఏడాది మీ అందరికి తెలిసిన అమ్మాయితోనే వరుణ్ తేజ్ వివాహం ఉంటుందని చెప్పుకొచ్చాడు. తీరా చూస్తే నిశ్చితార్థానికి ముందే వైరల్‌గా మారిన వీరి ప్రేమ నిజం అయి పెద్దల ఆశీర్వాదం కూడా తీసుకున్నారు. ఇక తాజాగా వారి పెళ్లి గురించి నెట్టింట్లో చర్చ మొదలైంది.
మాములుగా పెళ్లికి ముందు బ్యాచిలర్ పార్టీ(bachelor party) అనేది ఉంటుంది. ప్రస్తుతం వరుణ్ తేజ్ స్పెయిన్‌లో 40 మంది తన క్లోజ్ ఫ్రెండ్స్ కు బ్యాచిలర్ పార్టీ ఇచ్చారంట. తన బ్యాచిలర్ లైఫ్ కు ముగింపు పలుకుతూ స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేసినట్టు సమాచారం. ఇక మిగిలింది బాజాభజంత్రీలే. మరి దానికి కోసం డెస్టినేషన్ మ్యారేజ్ చేసుకోబోతున్నట్లు తెలుస్తుంది. ఇరు కుటుంబాలు ఇండస్ట్రీ ప్రముఖులతో ఇటలీలోని ఓ ప్యాలెస్ లో వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి పెళ్లి(Varun Tej – Lavanya Tripathi Wedding) ఘనంగా జరగనున్నట్టు ఇండస్ట్రీలో వినిపిస్తుంది. ఇప్పటికే ఇరు కుటుంబాలు పెళ్లి పనులలో బిజీగా ఉన్నారట. నవంబర్ ఫస్ట్ వీక్ లో వీరి పెళ్లి జరగబోతుందని తెలుస్తుంది. కానీ ఇప్పటి వరకు దీనిపై ఏలాంటి అధికారిక ప్రకటన అయితే వెలువడలేదు. పెళ్లికి ముందే వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి కలిసి విహార యాత్రల పేరిట పలు దేశాలు తిరిగేస్తున్నారు. ఇక వీరి జంటను చూసిన అభిమానులు, నెటిజనులు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని పొగుడుతున్నారు.
ఇక వరుణ్ తేజ్ నటించిన గాండీవధారి అర్జున చిత్రం మూవీ ఇటివల విడుదలై నిరాశ పరచగా.. ప్రస్తుతం యాడ్ ఫిల్మ్ శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వంలో నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందుతున్న ఆపరేషన్ వాలెంటైన్ చిత్రంలో వరుణ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్‌గా నటిస్తున్నాడు. ఈ చిత్రంలో మానుషి చిల్లర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా డిసెంబర్ 8న విడుదలకు సిద్దమవుతోంది. ప్రస్తుతం లావణ్య మూవీస్ కు కాస్త దూరంగానే ఉంది. కొత్త ప్రాజెక్టలకు అయితే సైన్ చేయలేదు.