ప్రకాశం: విశాఖపట్నంలో ఈనెల 31వ తేదీ నుంచి జనవరి 4 తేదీ వరకు జరగనున్న సీఐటీయు అఖిలభారత మహాసభ జయప్రదం చేయాలని కోరుతూ ఇవాళ పిసిపల్లిలో జెండాను ఆవిష్కరించారు. CITU నాయకులు మహేష్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను, నాలుగు లేబర్ కోడ్లుగా మార్చి కార్మికుల హక్కులను కాలు రాసిందన్నారు. కార్మికులకు కనీస వేతన చట్టం అమలు చేయాలన్నారు.