ADB: బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ ఎంపీటీసీ ఇందాల్ సింగ్, పలువురు నాయకులు బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ ఆడే గజేందర్ సమక్షంలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. నాయకులు కబీర్ సింగ్, ఫతే సింగ్, రాంసింగ్, జితేందర్, అశోక్, గౌతం, కైలాష్, షేర్ సింగ్, పాడ్వాల్, తదితరులున్నారు.