గోవా బ్యూటీ ఇలియానా డిక్రూజ్ (Ileana D’cruz) తల్లి అయిన సంగతి తెలిసిందే. కొన్ని రోజులుగా గర్భం (బేబీ బంప్) ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వస్తున్నారు. తాను ప్రెగ్నెంట్ అని ఆవిడ సగర్వంగా ఎప్పుడో ప్రకటించారు. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే..పండంటి మగబిడ్డ ఫోటోను సోషల్ మీడియా(Social media)లో షేర్ చేశారు కూడా! సాధారణంగా చిన్నారి పిల్లల ఫోటోలను ఎవరూ షేర్ చేయరు. దిష్టి తగులుతుందని! కానీ, ఇలియానా అలా కాదు.. అబ్బాయి ఫోటోలను బయట పెట్టేశారు! అబ్బాయి పేరు కూడా చెప్పారు. తన కుమారుడికి ‘కోవా ఫోనిక్స్ డోలాన్(Cova Phonics Dolan)అని పేరు పెట్టినట్లు ఇలియానా తెలిపారు.
ప్రస్తుతం మాతృత్వపు మాధుర్యాన్ని ఆస్వాదిస్తూ గడుపుతున్నారు. తాజాగా బాబును ఎత్తుకున్న ఫొటోను ఇన్స్టాగ్రామ్(Instagram)లో షేర్ చేసి అప్పుడే రెండు నెలలు అయిపోయిందని పేర్కొన్నారు. తాను కష్టకాలంలో ఉన్నప్పుడు తోడుగా నిలిచాడంటూ పలుమార్లు తన బాయ్‌ఫ్రెండ్ ఫొటో(Boyfriend photo)ను షేర్ చేసినప్పటికీ ముఖం కనిపించకుండా దాగుడుమూతలు ఆడిన ఇలియానా.. చాలా రోజుల తర్వాత అతడి ముఖాన్ని చూపిస్తూ ఫొటో షేర్ చేసి అభిమానులకు పరిచయం చేశారు. అతడి పేరును మైఖేల్ డోలాన్గా పేర్కొంది. తెలుగులో ఒకప్పుడు టాప్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన ఇలియానా ఆ తర్వాత బాలీవుడ్(Bollywood)కు వెళ్లారు. అయితే, అక్కడామెకు అనుకున్నంతగా కలిసిరాలేదు. ప్రస్తుతం విద్యాబాలన్‌తో కలిసి ఆమె ఓ సినిమా చేస్తున్నారు.