బిగ్ బాస్-7 (bigg boss season 7) నుంచి రతిక రోజ్ ఎలిమినేట్ అయింది.నాలుగో వారంలో ప్రియాంక, రతికరోజ్, ప్రిన్స్యావర్, శుభశ్రీ, గౌతమ్‌కృష్ణ, టేస్టీ తేజలు నామినేషన్స్‌లో ఉండగా, టేస్టీ తేజ, రతిక మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఈ క్రమంలో చివరిగా రతిక (Rathika Rose) ఎలిమినేట్ అయినట్లు వ్యాఖ్యాత నాగార్జున ప్రకటించగానే ఆమె ఒక్క సారిగా షాక్ అయింది. ఉబికి వస్తున్న కన్నీటిని ఆపుకొంటూనే హౌస్ నుంచి వేదికపైకి వచ్చింది. ‘రతిక హౌస్ లోపలికి పగిలిన హృదయంతో వెళ్లావు. ఇప్పుడు ఫుల్ హార్ట్‌తో వచ్చావా’ అని నాగార్జున ప్రశ్నించగా, ‘లేదు. ఇంత తొందరగా రావాలనిపించలేదు.
ఇంకా ఆడితే బాగుండనిపించింది. అంతా కలలా ఉంది’ అంటూ సమాధానం ఇచ్చింది. ప్రస్తుతం 11మంది కంటెస్టెంట్స్ (Contestants) హౌజ్‌లో ఉన్నారు. అందులో శివాజీ, సందీప్ మాస్టర్, శోభ, పల్లవి ప్రశాంత్(Pallavi Prashant)లు హౌజ్ మేట్లుగా ఉండటంతో నామినేషన్ల లెక్కలోకి రారు. ఇక మిగిలిన ఏడుగురు శుభ శ్రీ (Subha Sri) గౌతమ్ కృష్ణ, ప్రిన్స్ యావర్, టేస్టీ తేజ, రతిక రోజ్, ప్రియాంక జైన్, అమర్ దీప్ చౌదరిలు నామినేట్ అయ్యారు. ఓటింగ్ పోల్స్ ప్రకారం రతికకు తక్కువగా ఓట్లచ్చాయి. దాంతో టైటిల్ ఫేవరెట్‌గా వచ్చిన రతిక నాలుగోవారం ఎలిమినేట్ అయింది.హౌజ్‌లోకి వెళ్లిన మెదట్లో రతిక చురకుగానే ఉండేది. గేమ్‌లు, టాస్క్‌లు గట్రా కూడా బాగా ఆడేది.
అప్పుడే సింగర్ రాహుల్(Singer Rahul)తో దిగిన ఫోటోలు బయటకు రావడం.. ఎక్స్‌బాయ్ ఫ్రెండ్ గుర్తొస్తున్నాడని రతిక చెబుతుందని శుభ శ్రీ నామినేషన్లో మాట్లాడటం, అదే టైమ్‌లో రాహుల్ ఇన్‌స్టాలో ఆమెను ఉద్దేశించి పోస్ట్ పెట్టడం వంటివి రతికపై నెగెటీవ్ వైబ్స్ తీసుకొచ్చాయి. దానికి తోడు హౌజ్‌లో లవ్ ట్రాక్స్ (Love tracks)నడపడం కూడా ఆమెపై ప్రతీకూల ప్రభావం ఏర్పడింది. పల్లవి ప్రశాంత్‌కు వెన్నుపోటు పొడవడం, యావర్‌ను కంటెండర్‌గా, హౌజ్‌మేట్‌గా చూడాలని అతనికి చెప్పి.. కన్ఫెషన్ రూమ్‌లో మాత్రం వ్యతిరేకంగా మాట్లాడటం.. ఇలా అవసరానికి మాత్రమే వాడుకునే లక్షణాలు ఉండటం వంటి పలుకారణాలతో రతిక ఎలిమినేట్ అయింది.