»Pallavi Prashant Emotion At Bigg Boss 7 Nominations
Bigg Boss 7 telugu: హౌస్ నామినేషన్స్‌లో రచ్చ రచ్చ
పది వారాలు పూర్తి చేసుకున్న తెలుగు బిగ్ బాస్ కంటెస్టెంట్లు ఈ వారం జరిగే నామినేషన్లో మాములు రచ్చ చేయలేదు. ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చుకున్నారు. ఆ క్రమంలో యావర్‌కు అమర్‌కు మధ్య జరిగిన గొడవ పతాక స్థాయికిి చేరుకుంది. మరి ఈ వారం ఎవరూ ఎలిమినేట్ అవుతారో చూడాలి.
Pallavi Prashant Emotion at Bigg Boss 7 Nominations
bigg boss 7 telugu: ఈ సీజన్ బిగ్ బాస్ 7 తెలుగు షో ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తోంది. మొత్తం హౌస్‌లో ప్రస్తుతం పది మంది ఉన్నారు. పదివారాలు దాటి బిగ్ బాస్ విన్నర్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్న వారికి ఈ వారం నామినేషన్‌కు బిగ్ బాస్ ఒక టాస్క్ ఇచ్చాడు. 1 నుంచి 10 అంకెల టేబుల్స్ పెట్టి, మొత్తం ఇంట్లో వారి ఆటతీరును బట్టి ర్యాంకింగ్ నిర్ణయించాలంటు వారిలో వారికే చిచ్చు రాజేశాడు. దీంతో రెచ్చిపోయిన పోటీదారులు ఒకరిపై ఒకరు విరుచుకుపడ్డారు. శోభ కెప్టెన్ గా ఉన్నప్పటికీ తన నిర్ణయాలు నచ్చలేదని రతిక నామినేట్ చేసింది. అలాగే ప్రియాంకను కూడా నామినేట్ చేసింది.
తరువాత సొంత అభిప్రాయం..సొంత ఆటతీరు లేదంటూ పల్లవి ప్రశాంత్(Pallavi Prashant)ను అర్జున్ నామినేట్ చేశాడు. అలాగే శివాజీ(Shivaji)తో ప్రశాంత్ సాన్నిహిత్యంగా ఉండటం గురించి మాట్లాడాడు. దాంతో రెచ్చిపోయిన ప్రశాంత్ హౌస్‌లో శివాజీ తనకు ఎంతో చేశాడని, మొట్టమొదటి సారి నన్ను క్యాప్టెన్ చేశాడని తనదైన స్టైల్లో రెచ్చిపోయాడు. ఇక యావర్‌కు అమర్‌కు మధ్య గొడవ తారా స్థాయికి చేరుకుంది. గడిచిపోయిన వారాల విషయాలను తీసుకొచ్చి తనని నామినేట్ చేయడం కరెక్టు కాదని యావర్‌తో అమర్ వాదించాడు. ఈ వారం నామినేట్ అయిన వారిలో శోభ, ప్రియాంక, అమర్ వరుసగా మూడు స్థానాల్లో ఉన్నారు.