The nominations of Telangana have ended.. How much is the total?
Lok Sabha Elections: దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల హీట్ ఉంది. ఈ సందర్భంగా నాల్గం దశలో తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా ఈ రోజుతో ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 17 లోక్ సభ స్థానాలకు మొత్తం 547 నామినేషన్లు దాఖలయ్యాయని రాష్ట్ర ఎన్నికల కమిషన్ తెలిపింది. ఏప్రిల్ 18న నామినేషన్ ప్రక్రియ ప్రారంభం అయింది. ప్రధాన పార్టీల అభ్యర్థుతో పాటు డూప్లికేట్ అభ్యర్థులు, రెబల్ అభ్యర్థలతో సహా చాలా మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. రేపు నామినేషన్ల పరిశీలన ప్రక్రియ ప్రారంభం అవుతుంది. ఈ నెల 29 వరకు అభ్యర్థుల ఉపసంహరణకు అవకాశం ఉంది. మే 13న పోలింగ్ జూన్ 4న రిజల్ట్ వెలవడనున్నాయి.
అత్యధికంగా ఖమ్మం లోక్ సభ స్థానానికి 29 నామినేషన్లు వచ్చాయి. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న రెండు పార్లమెంట్ నియోజకవర్గాల స్థానాలకు 120కి పైగా నామినేషన్లు దాఖలయ్యాయి. గురువారం చివరి రోజు కావడంతో ఎక్కవ నామినేషన్లు వచ్చినట్లు తెలుస్తుంది. ఈ రోజు మంచి రోజు కావడం, అలాగే కొంత మంది రెండు, మూడు సెట్ల నామినేషన్లు దాఖలు చేయడంతో రాష్ట్రవ్యాప్తంగా కలెక్టర్ ఆఫీస్ పరిసర ప్రాంతాలన్ని జనసంద్రోహంగా ఉన్నాయి. అలాగే సికింద్రబాద్ కంటోన్మెంట్లో ఉప ఎన్నిక ఉన్నందుకు అక్కడ 13 నామినేషన్లు దాఖలయ్యాయి.