»Heroine Karthika Nair Introduced Her Future Husband
Karthika nair: కాబోయే భర్తను పరిచయం చేసిన యంగ్ హీరోయిన్
గత కొన్ని రోజులుగా ప్రేమలో ఉన్న యంగ్ హీరోయిన్ కార్తీక నాయర్ తనకు కాబోయే వరుడిని పరిచయం చేసింది. ఇటివలనే నిశ్చితార్థం చేసుకున్న ఈ భామ తాజాగా ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో తన కాబోయే భర్త రోహిత్ మీనన్ ఫోటోలను పోస్ట్ చేసి అభిమానులకు పరిచయం చేసింది. ఇవి చూసిన ఫ్యాన్స్ పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.
heroine karthika nair introduced her future husband
సీనియర్ నటి రాధ కూతురుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కార్తీక నాయర్(karthika nair)మొదటి సినిమాతోనే అభిమానులను సంపాదించుకుంది. ఆ తర్వాత దాదాపు ఎనిమిదేళ్లుగా వెండితెరకు దూరంగా ఉన్న ఈమె ఇటీవల పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించింది. అంతేకాదు గత నెలలో ఎంగేజ్మెంట్ చిత్రాన్ని షేర్ చేసి ఆశ్చర్యపరిచిన ఈమె.. తాజాగా తన కాబోయే భర్త రోహిత్ మీనన్‌ను పరిచయం చేసింది. ఆమె అతనితో నవ్వుతున్న చిత్రాలను పంచుకుంటూ, “నిన్ను కలవడం ఒక విధి. నిన్ను ప్రేమించడం ఒక మాయాజాలం. మన జీవిత ప్రయాణాన్ని ప్రారంభించడానికి కౌంట్‌డౌన్‌ను ప్రారంభిద్దామని” రాసుకొచ్చి పలు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ఈ చిత్రాలను చూసిన నెటిజన్లు(netizens) కాబోయే వధూవరులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అంతేకాదు వరుడి ముక్కుకు, చేవుకు పొగులు ఉండటం చూసిన అభిమానులు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఇది ట్రెండ్ అని కొంత మంది అంటుండగా..మరికొంత మంది మాత్రం అబ్బాయిలు ముక్కులు కుట్టించుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇక 2009లో విడుదలైన ‘జోష్’తో హీరోయిన్గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కార్తీక.. 2011లో విడుదలైన ‘రంగం’(rangam heroine)తో విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత పలు తెలుగు, మలయాళం, తమిళ చిత్రాల్లో నటించింది. ‘దమ్ము’, ‘బ్రదర్ ఆఫ్ బొమ్మాళి’ వంటి చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు. కార్తీక 2015 నుంచి వెండితెరకు దూరంగా ఉంది.