Electric Car Turns Into Fireball In Middle Of Bengaluru Road
Electric Car: పెట్రోల్, డీజిల్ వెహికిల్స్ వినియోగించడం వల్ల పర్యావరణంపై పెను ప్రభావం చూపుతోందని.. ఎలక్ట్రిక్ వాహనాలను ఉపయోగించాలని పర్యావరణ వేత్తలు, ప్రభుత్వాలు కోరుతున్నాయి. జనంలో కూడా ఆ దిశగా మార్పు వచ్చింది. కార్లు అయితే బాగానే కొనుగోలు చేస్తున్నారు. అవసరాన్ని బట్టి స్కూటర్ల విక్రయాలు జరుగుతున్నాయి.
ఇటీవల ఓలా స్కూటీల కొనుగోలు పెరిగాయి. కొందరు ఛార్జీంగ్ ఎలా చేస్తున్నారో కానీ.. పేలాయి. వరసగా పేలడంతో కలకలం రేగింది. ఇప్పుడు కార్ల (Electric Car) వంతు వచ్చినట్టు ఉంది. ఐటీ హబ్ బెంగళూరులో.. జేపీ నగర్ వద్ద గల దాల్మియా సర్కిల్ వద్ద నిన్న ఓ ఈవీ కారులో మంటలు చెలరేగాయి. దాంతో ఒక్కసారిగా కలకలం రేగింది. వీకెండ్ కావడం.. మెయిన్ రోడ్ కావడంతో జనం గుమికూడి మరీ వీడియో తీశారు. సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అవుతుంది.
ఆ వీడియోకు వేలాది లైకులు రాగా.. చాలా మంది కామెంట్స్ చేశారు. ఎలక్ట్రిక్ కార్లు కొనుగోలు చేయడం అనేది ఇప్పటికే ప్రశ్నగానే ఉందని ఒకరు.. ఓ మై గాడ్ అని మరొకరు రాశారు. ఇప్పటివరకు బైక్లు మాత్రమే పేలేవి.. ఇప్పుడు కార్లు వంతు వచ్చిందా అంటూ ఆశ్చర్యపోయారు. ఆ కారుకు మంటలు అంటుకోగా.. రెండు సార్లు పేలింది. అక్కడున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ జనాలను దూరం వెళ్లిపోవాలని కోరాడు.