Hema: హేమ కాదు కృష్ణవేణి, అయినా అడ్డంగా దొరికిపోయింది!
ప్రస్తుతం బెంగళూరు రేవ్ పార్టీ కేసు వ్యవహారం హాట్ టాపిక్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ పార్టీలో టాలీవుడ్ నటి హేమతో పాటు అషి రాయ్‌లు కూడా ఉన్నారు. ఈ ఇద్దరికి చేసిన డ్రగ్స్ టెస్టులో పాజిటివ్ అని కూడా తేలింది. అయితే.. ఈ కేసు నుంచి తప్పించుకోవడానికి హేమ తప్పుడు పేరు చెప్పినట్టుగా తెలిసింది.
Krishnaveni, not Hema, was caught in the crossfire!
Hema: ప్రస్తుతం హెబ్బగుడి పోలీస్ స్టేషన్లో ఈ బెంగళూరు రేవ్ పార్టీ కేసుకు సంబంధించిన విచారణ జరుగుతోంది. బెంగుళూరు రేవ్ పార్టిలో పట్టుబడ్డ వారిని డ్రగ్స్ టెస్ట్ చేయగా.. పాజిటివ్ వచ్చిన వారికి బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ నోటీసులు పంపినట్టు తెలుస్తోంది. ఈ కేసులో A1 గా వాసు, A2 గా అరుణ్ కుమార్, A3 నాగబాబు, A4 రణధీర్ బాబు, A5 మహమ్మద్ అబూబాకర్, A6గా గోపాల్ రెడ్డిని నమోదు చేయగా A7గా 68 మంది యువకులు, A8గా 30 మంది యువతులను చేర్చారు. ఈ పార్టీలో 73 మంది యువకులు పాల్గొనగా 59 మందికి పాజిటివ్ అని రిపోర్ట్ వచ్చింది. 30 మంది యువతులు పాల్గొనగా 27 మందికి పాజిటివ్ అని తేలింది. మొత్తం 130 మంది పార్టీలో పాల్గొనగా, 86 మందికి డ్రగ్స్ టెస్ట్‌లో పాజిటివ్ అని తేలడం సంచలనంగా మారింది. అయితే.. టాలీవుడ్ నుంచి హేమ పేరు ఈ పార్టీలో మరింత హాట్ టాపిక్ అయింది.
అయితే.. హేమ మాత్రం ఇందులో నిజం లేదని ఓ వీడియో పోస్ట్ చేసింది. నేను హైదరాబాదులోనే ఉన్నాను అని చెప్పుకొచ్చింది. దీంతో నిజంగానే హేమ ఆ పార్టీకి వెళ్లిందా? లేదా? అనేది తేల్చుకోలేకపోయారు నెటిజన్స్. దీనికి కారణం ఇదేనని అంటున్నారు. ఈ కేసులో పట్టుబడినప్పుడు హేమ తన పేరుకు బదులుగా.. మరో పేరు చెప్పినట్టుగా తెలిసింది. పోలీసులు వివరాలు అడిగినప్పుడు తన పేరు హేమ అని కాకుండా కృష్ణవేణి అని చెప్పిందట. దీంతో.. పోలీసులు కృష్ణవేణి పేరుతోనే కేసు నమోదు చేశారని తెలిపారు. ఈ కేసు నుంచి తప్పించుకోవడానికి హేమ తప్పుడు పేరు చెప్పింది. అయినా కూడా.. హేమ రక్త నమూనాలలో డ్రగ్స్ ట్రెసెస్ ఉంండంతో.. ఆమెకు నోటీసులు ఇచ్చి విచారణ జరపబోతున్నారు పోలీసులు. ఏదేమైనా.. హేమ మాత్రం అడ్డంగా దొరికిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.