»Dharshan Wife Dont Call Pavitri Darshans Wife Darshans Wifes Letter To The Commissioner
Dharshan Wife: పవిత్రను దర్శన్ భార్య అనవద్దు.. కమిషనర్‌కు దర్శన్ భార్య లేఖ
తన అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో కన్నడ నటుడు దర్శన్, అతని స్నేహితురాలు పవిత్రా గౌడ ప్రస్తుతం కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే. విచారణ క్రమంలో వీరిద్దరినీ పోలీసులు దంపతులుగా పేర్కొనడంపై దర్శన్ భార్య విజయలక్ష్మి అభ్యంతరం వ్యక్తం చేస్తూ బెంగళూరు పోలీసు కమిషనర్‌కు లేఖ రాశారు.
Dharshan Wife: Don't call Pavitri Darshan's wife.. Darshan's wife's letter to the commissioner
Dharshan Wife: తన అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో కన్నడ నటుడు దర్శన్, అతని స్నేహితురాలు పవిత్రా గౌడ ప్రస్తుతం కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. విచారణ క్రమంలో వీరిద్దరినీ పోలీసులు దంపతులుగా పేర్కొనడంపై దర్శన్ భార్య విజయలక్ష్మి అభ్యంతరం వ్యక్తం చేస్తూ బెంగళూరు పోలీసు కమిషనర్‌కు ఇలా లేఖ రాశారు. ఇటీవల మీడియా సమావేశంలో పవిత్రను దర్శన్ భార్య అంటూ మీరు తప్పుగా ప్రకటన చేశారు. ఆ తర్వాత కర్ణాటక హోంమంత్రి కూడా భార్య అనే అన్నారు.
ఓ మీడియాతో హోంమంత్రి మాట్లాడుతూ నటుడి దంపతులు అరెస్టయ్యారని ఆ మంత్రి చెప్పారు. కానీ ఆమె దర్శన్ భార్య కాదు. కేవలం నా భర్తకు స్నేహితురాలు మాత్రమే. దర్శన్‌కు చట్టపరమైన భార్యను నేను ఒక్కదానిని మాత్రమే. పోలీసు రికార్డుల్లో ఆమె పేరును మీరు దర్శన్ సతీమణిగా పేర్కొనవద్దని లేఖలో రాశారు. ఇది భవిష్యత్తులో నాకు, నా కుమారుడికి సమస్యలు తెచ్చిపెడుతుంది. పవిత్రకు సంజయ్‌సింగ్ అనే వ్యక్తితో వివాహమైంది. వాళ్లకి ఓ కుమార్తె కూడా ఉంది. దయచేసి నిజాలను మాత్రమే రికార్డుల్లో స్పష్టంగా రాయండని విజయలక్ష్మి లేఖలో రాశారు. రేణుకాస్వామి హత్య కేసులో అరెస్టయిన దర్శన్, పవిత్ర గౌడతో పాటు మరో 15 మంది నిందితులకు జ్యుడీషియల్ కస్టడీ పొడిగిస్తూ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. జులై 18 వరకు కస్టడీని పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.