»The Finance Ministry Has Announced An Interest Rate Of 7 1 For Central Government Employees Pf Schemes
Finance Ministry: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పీఎఫ్ పథకాలకు 7.1% వడ్డీ రేటును ప్రకటించిన ఆర్థిక శాఖ
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్థిక మంత్రిత్వ శాఖ శుభవార్త చెప్పింది. జూలై-సెప్టెంబర్ త్రైమాసికానికి 7.1 శాతం వడ్డీ రేట్లు పొందే పథకాలను ప్రకటించింది. దీని ద్వారా చాలా కుటుంబాలు ఉపశమనం పొందుతాయి అని పేర్కొంది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.
The Finance Ministry has announced an interest rate of 7.1% for Central Government Employees' PF Schemes
Finance Ministry: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్థిక శాఖ శుభవార్త చెప్పింది. జూలై-సెప్టెంబర్ త్రైమాసికానికి గాను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ (GPF), ఇతర పీఎఫ్ పథకాలకు ఆర్థిక మంత్రిత్వ శాఖ 7.1 శాతం వడ్డీ రేటును ప్రకటించింది. ఈ మేరకు ఆర్థిక మంత్రిత్వ శాఖ జులై 3న ప్రకటన విడుదల చేసింది. అందులో ఈ విధంగా పేర్కొంది. “2024-2025 సంవత్సరంలో, జనరల్ ప్రావిడెంట్ ఫండ్, అలాగే ఇతర ఫండ్ల విషయంలో ఖాతా దారులకు 7.1 శాతం వడ్డీని కల్పిస్తున్నట్లు ప్రకటించింది. 1 జూలై 2024 నుండి 30 సెప్టెంబర్ 2024 వరకు ఈ వడ్డీ రేటు అమలులో ఉంటుంది. అంటే జూలై 1 అమలులోకి వచ్చిందని పేర్కొంది.”
దీనిలో భాగంగా జూలై-సెప్టెంబర్ కాలంలో 7.1 శాతం వడ్డీ రేట్లు పొందే పథకాలు కింద జనరల్ ప్రావిడెంట్ ఫండ్ (సెంట్రల్ సర్వీసెస్), కాంట్రిబ్యూటరీ ప్రావిడెంట్ ఫండ్, ఆల్ ఇండియా సర్వీసెస్ ప్రావిడెంట్ ఫండ్, ది స్టేట్ రైల్వే ప్రావిడెంట్ ఫండ్, జనరల్ ప్రావిడెంట్ ఫండ్‌కు వర్తిస్తుంది. అలాగే డిఫెన్స్ సర్వీసెస్, ది ఇండియన్ ఆర్డినెన్స్ డిపార్ట్మెంట్ ప్రావిడెంట్ ఫండ్ వీటితో పాటు నిత్యవసర వస్తువులు, మొబైల్ ఫోన్లపై పన్ను రేట్లు తగ్గించినట్టు పేర్కొంది. దీని ద్వారా భారత దేశంలో చాలా కుటుంబాలకు ఉపశమనం కలుగుతుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS) లో ఎలాంటి మార్పులు చేయలేదు. ఇంతకు ముందు ఉన్నట్లు 8.2 శాతమే జూలై-సెప్టెంబర్ త్రైమాసానికి వర్తిస్తుంది. అలాగే నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (NSC) వడ్డీ రేటు 7.7 శాతంగా ఉంది.