జపాన్ ప్రజలు మరోసారి ఉలిక్కిపడ్డారు. దేశంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.0గా నమోదైంది. భూమి ఒక్కసారిగా కంపించడంతో జనం భయంతో ఇళ్లు, ఆఫీసుల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే ఇప్పటివరకు సునామీ హెచ్చరికలు గానీ, ఆస్తి, ప్రాణ నష్టం వివరాలు గానీ తెలియరాలేదు. అధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.