EG: నిడదవోలు మండలం మునిపల్లి వద్ద బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో పదేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో అత్తిలి భరత్ అనే బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో సమిశ్రగూడెం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి కారణమైన వాహనం కోసం గాలిస్తున్నారు.