కామారెడ్డి జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా జనవరి 1 నుంచి 31 వరకు జిల్లా వ్యాప్తంగా 30, 30(ఏ) పోలీస్ యాక్ట్ 1861 అమలులో ఉంటుందని SP రాజేష్ చంద్ర తెలిపారు. పోలీసు అధికారుల ముందస్తు అనుమతి లేకుండా ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించరాదన్నారు. ఏవైనా చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.