W.G: నరసాపురం ఎంపీ, కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మను భీమవరం నూతన డీఎస్పీ రఘువీర్ విష్ణు మర్యాదపూర్వకంగా ఆయన కార్యాలయంలో బుధవారం కలిశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ వర్మకు పండ్ల బుట్టను అందించారు. సామాన్య ప్రజలకు భరోసా కల్పించే విధంగా పనిచేయాలని, అసాంఘిక కార్యకలాలపై ఉక్కు పాదం మోపాలని శ్రీనివాస్ వర్మ సూచించారు.